Voted for Congress out of anger on KCR Etala Rajender
Etala Rajender: గత ప్రభుత్వం(BRS) చేసిన అభివృద్ధి ఏం లేదని ప్రజలు నమ్మారు. అందుకే కేసీఆర్(KCR)ను గద్దె దించారని బీజేపీBJP) నేత ఈటల రాజేందర్(Etala Rajender) ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్ నాయకుల పైనా, కేసీఆర్ ఆహంకారం పైన కోపంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారు. అదే సమయంలో వారికి రేవంత్ రెడ్డి బలమైన వ్యక్తిగా కనిపించాడు అందుకే కాంగ్రెస్లో ఏ ఎమ్మెల్యే నిలబడినా ఓట్లు వేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ ఉండీ కాదని విమర్శించారు. అదే విధంగా గతంలో ఒక్క టికెట్ ఆ తరువాత 3 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఉన్న బీజేపీ ఈ ఎ్ననికల్లో పురొగతి సాధించిందని మొత్తం 8 సీట్లు దక్కించుకుందని అన్నారు. నాయకుడు బలంగా ఉంటే ఓట్లు పడుతాయని ఆయన గుర్తు చేస్తూ… లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అహా కొనసాగుతుందని అన్నారు.
సోమవారం ఆయన గజ్వేల్లో మీడియాతో మాట్లాడుతూ.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తారని, ఎందుకంటే ప్రధాని మోడీ ఎంత బలమైన నాయకుడో ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేకుండా ఎన్టీయే ప్రభుత్వం కొనసాగుతోందని మూడవ సారీ అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తామని అన్నారు. గతంలో పాలించిన యూపీఏ ప్రభుత్వం చేసిన అవినీతి అందరికి తెలుసని అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మోడీ ప్రభుత్వానిది అని, పది లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.