భార్యబాధితుల సంఘాలు వెలిశాయి అంటే అందరూ నవ్వుకుంటారు.. కానీ మోసేవాడికే తెలుస్తుంది కావిడి బరువు అన్నట్లు బరించే భర్తలకే తెలుస్తుంది భార్య పెట్టే బాధలు. ఒక సర్వేలో బయటపడిన నిజాలు.
Viral News: ఒకప్పుడు భార్య భర్తల గొడవలు(husbands&wives Quarrels) అంటే వీధుల్లో జరిగేవి అందరికీ తెలిసేది, ఇప్పుడు గౌరవంగా గడపదాటకుండా గొడవ పడుతున్నారు. ఇదిలా ఉంటే భార్యభర్తల గొడవలపై ఓ అధ్యయనాన్ని అంతార్జాతీయ మీడియా సంస్థ ప్రచురించింది. అందులో అందరూ విస్తూ పోయే నిజాలు బయట పడ్డాయి. మన దేశంలో భార్యల చేతుల్లో చావుదెబ్బలు తింటున్న భర్తలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నారు తేల్చింది. బయో సోషల్ స్టడీస్‌లో అనే రీసెర్చ్ సంస్థ తాజా అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించింది.
భార్యల చేతుల్లో తన్నులు తింటున్న వారిలో ఎక్కువగా తాగుబోతులు, నిరక్షరాస్యులే ఉన్నారు. దేశంలో భర్తలపై జరుగుతున్న గృహహింసపై ఈ సంస్థ చేసిన అధ్యయనాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్
రీసెంట్గా ప్రచురించింది. గత 15 ఏళ్లుగా ఈ దాడులు ఐదింతలు పెరిగినట్టు ఈ అధ్యయనం పేర్కొంది. ప్రతీ 1000 మంది మహిళల్లో 36 మంది భర్తలను కొడుతున్నట్లు పేర్కొంది. 2006లో మాత్రం ఈ సంఖ్య 7గా ఉంది. మనదేశంలో మహిళలకు మాత్రమే రక్షణ చట్టాలు ఉండడం ఒక కారణమని ఈ అధ్యయనం పేర్కొంది. అలాగే మద్యం మత్తులో భార్యలను వేధించడంతో విసిగిపోయిన మహిళమనులు దాడులకు పాల్పడుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది.