»Crowd Of Devotees Increased In Tirumala During Holidays
TTD : సెలవుల వేళ…తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల (Tirumala) కొండ నిండా భక్తులే ఉన్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుపతి దేవస్థానంలో (Tirupati Devasthanam) భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి (Srivari) సర్వదర్మనానికి 30 గంటల సమయం పడుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల (Tirumala) కొండ నిండా భక్తులే ఉన్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుపతి దేవస్థానంలో (Tirupati Devasthanam) భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి (Srivari) సర్వదర్మనానికి 30 గంటల సమయం పడుతుంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ (TTD) తాగునీరు, ఆహారం అందిస్తోంది. నిజపాద దర్శనాలను పునః ప్రారంభించాలని భక్తులు కోరారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD Evo Dharma Reddy) తెలిపారు. నిజపాద దర్శనం వల్ల స్వామివారికి నైవేద్యం ఆలస్యం అవుతుందని అన్నారు. సుదర్శనం, గోవర్ధన్, కల్యాణి సత్రాలల్లో పారిశుధ్యం బాగాలేదని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. మూడు సత్రాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తామని చెప్పారు.
మార్చి నెలలో(March is the month) శ్రీవారిని 20.57 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. 8.25 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. మార్చి నెలలో శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.120.29 కోట్లు అని తెలిపారు. మార్చి నెలలో విక్రయించిన లడ్డూల సంఖ్య 1.02 కోట్లుగా ఉందని అన్నారు. తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి గరుడ వాహన సేవ(Garuda vahana seva) అత్యంత వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి(Malayappa swamy) గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ ప్రాముఖ్యత సంతరించుకుందని ఆలయ అర్చకులు తెలిపారు.