మద్యపానం (Drinking Alcohol) ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. మద్యానికి (Liquor) బానిసైన వారు ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియదు. తాగిన మైకంలో దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా అలాంటి సంఘటనే మరోటి జరిగింది. మద్యం సేవించి ఇంట్లో గొడవ చేస్తున్నాడని తండ్రి తన కుమారుడిని మందలించాడు. ఈ క్రమంలోనే మద్యం సేవించొద్దు అని చెప్పగా ఆ యువకుడు వినలేదు. నన్నే తాగొద్దంటావా అంటూ తండ్రిపై రెచ్చిపోయాడు. గుడి సమీపంలో ఉన్న త్రిశూలం (Trishul) తీసుకుని పొడిచి తండ్రిని చంపివేశాడు. ఈ సంఘటన చత్తీస్ గడ్ (Chhattisgarh)లో చోటుచేసుకుంది.
రాజ్ నంద్ గావ్ (Rajnandgaon District) జిల్లాకు చెందిన దుఖు రామ్ (61) కుమారుడు ఖేమ్ లాల్. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో (Nasik District) కుమారుడు ఖేమ్ లాల్ గా పని చేస్తుంటాడు. సెలవుపై గ్రామానికి వచ్చాడు. అయితే అప్పటికి మద్యానికి బానిస అయ్యాడు. ఊరికి వచ్చినప్పటి నుంచి విపరీతంగా తాగుతున్నాడు. తాగి ఇంట్లో గొడవలు పడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు అతడి వలన ఇబ్బందులు పడుతున్నాడు. ఈనెల 2వ తేదీన గ్రామంలోని శిత్లా దేవి ఆలయం వద్ద కుమారుడు ఖేమ్ లాల్ మద్యం మత్తులో ఇతరులతో గొడవపడుతున్నాడు.
ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తండ్రి దుఖు రామ్ కుమారుడిని నివారించాడు. గొడవ పడొద్దంటూ ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఈ సమయంలో తండ్రితో వాగ్వాదం (Clashes) మొదలైంది. మద్యం తాగొద్దు అంటూ తీవ్ర ఆవేశంలో చెప్పాడు. నన్ను తాగొద్దంటావా అంటూ ఆలయం ముందు ఉన్న త్రిశూలాన్ని ఖేమ్ లాల్ తీసుకుని తండ్రిని (Father) పొడిచాడు. ఈ పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో ఉన్న దుఖు రామ్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయాడు. నిందితుడిని పోలసీులు అరెస్ట్ చేశారు.