Hindu Communities : సీఎం జగన్ పై మండిపడ్డ హిందూ సంఘాలు..!
Hindu Communities : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పీఠాధిపతులు సైతం ఆయన వ్యవహరించిన తీరుపై సీరియస్ అవుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వివాహ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్ దంపతులు హాజరు కావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పీఠాధిపతులు సైతం ఆయన వ్యవహరించిన తీరుపై సీరియస్ అవుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వివాహ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్ దంపతులు హాజరు కావాల్సి ఉంది. అయితే… ఆయన కాలు నొప్పి అని వెళ్లకుండా ఆగిపోయారు. తరువాతి రోజున మాత్రం చిలకలూరి పేటలో జరిగిన పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో… ఇప్పుడు ఈ విషయం వివాదంగా మారింది. ఆలయానికి వెళ్లడానికి వచ్చిన నొప్పి… చిలకలూరిపేట వెళ్లడానికి అడ్డు ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న హిందూ కార్యక్రమాలకు ప్రభుత్వాధినేతగా సీఎం హాజరుకావలసి కార్యక్రమాలకు ఏదో ఒక సాకు చెప్పి తప్పుకుంటున్నారని అన్నారు. కొన్ని రకాల హిందూ ధార్మిక కార్యక్రమాలకు ప్రభుత్వాధినేతలు సతీసమేతంగా హాజరుకావలసి ఉంటుందని, కానీ, సీఎం జగన్ తన భార్యతో కలిసి ఎప్పుడైనా హిందూ ధార్మిక కార్యక్రమాలకు హాజరయ్యారా అని ప్రశ్నిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసనంద సరత్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవమత భావాలు కలిగిన సీఎం జగన్కు, ఆయన కుటుంబానికి హిందూమత సంప్రదాయాలను గౌరవించడం, హిందూ దేవాలయాలకు వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదని వ్యాఖ్యలు చేశారు. ఒంటిమిట్ట శ్రీసీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి ఉన్నా, కాలు బెణికిందనే సాకుతో వెళ్లకుండా ఉండిపోయారని అన్నారు. మరోపక్క టీడీపీ పార్టీ నేతలు సైతం జగన్ తీరు ఫై మండిపడుతున్నారు.
ఒంటిమిట్టకు వెళ్లకుండా జగన్ కుంటిసాకులు చెప్పారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గన్ కాలు బెణికింది అనేది ఓ సాకు మాత్రమేనని ఆయన అన్నారు. సతీసమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్టకు వెళ్లలేదని అచ్చెన్న విమర్శించారు. గురువారం కార్యక్రమాల్లో జగన్ చక్కగా పాల్గొన్నారని, ఒంటిమిట్ట కల్యాణం అంటేనే సీఎంకు కాలునొప్పి వచ్చిందా? అని నిలదీశారు.