Manish Sisodia : ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ప్రధాని ని ఉద్దేశించి మాట్లాడటం గమనార్హం. దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని మనీశ్ సిసోడియా అన్నారు. తన విద్యార్హతలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ప్రధాని ని ఉద్దేశించి మాట్లాడటం గమనార్హం. దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని మనీశ్ సిసోడియా అన్నారు. తన విద్యార్హతలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. హిందీ భాషలో రాసిన లేఖను సిసోడియా రిలీజ్ చేశారు. దేశ ప్రగతి కోసం ఓ విద్యావంతుడైన వ్యక్తి ప్రధాని కావాలని మాజీ డిప్యూటీ సీఎం తన లేఖలో తెలిపారు.
ప్రధాని మోడీ విద్యార్హతలపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోడీ తక్కువగా చదువుకున్నారని, అలాంటి వ్యక్తి దేశానికి ప్రమాదకరమని సిసోడియా తన లేఖలో తెలిపారు. మోడీజీకి సైన్స్ అర్ధం కాదన్నారు. ఆయన విద్య యొక్క విలువ తెలియదన్నారు. గత కొన్నేళ్లలో దేశంలో సుమారు 60 వేల స్కూళ్లను మూసివేసినట్లు సిసోడియా ఆరోపించారు. ప్రధాని ఎడ్యుకేషన్ గురించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కేసు వేశారు. అయితే ఆయనకు ఆ కేసులో కోర్టు 25వేల ఫైన్ వేసింది. కాగా, లిక్కర్ స్కామ్లో జైలు జీవితం అనుభవిస్తున్న మనీశ్ సిసోడియా ఈరోజు ప్రధాని మోడీకి లేఖ రాయడం గమనార్హం.