Minister Botsa బాలయ్యకి కౌంటర్…. ఆ ఎమ్మెల్యేలు ఎవరో చెప్పండి..!
Minister Botsa : వైసీపీ ఎమ్మేల్యులు చాలా మంది టచ్ లో ఉన్నారంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆ కామెంట్స్ కి తాజాగా వైసీపీ కౌంటర్లు వేయడం మొదలుపెట్టింది.
వైసీపీ ఎమ్మేల్యులు చాలా మంది టచ్ లో ఉన్నారంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా… ఆ కామెంట్స్ కి తాజాగా వైసీపీ కౌంటర్లు వేయడం మొదలుపెట్టింది. టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో పేర్లు చెప్పాలంటూ ఎదురుదాడికి దిగారు మంత్రి బొత్స సత్యనారాయణ.
అనవసరపు మాటలొద్దంటూ బాలయ్యకు బొత్స వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి పాలిటిక్స్ ఎప్పటి నుంచో చూస్తున్నామని సీఎం జగన్ ఏపీకి రక్ష అని బదులిచ్చిన బొత్స చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో చెప్పాలంటూ బాలయ్యను డిమాండ్ చేశారు. దోపీడీ దారులకు మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని భయం పట్టుకుందని చెప్పారు. గతంలో విద్య అంటే కేరళ గుర్తుకొచ్చేదని ఇప్పుడంతా ఏపీ గురించే చర్చించుకుంటున్న సంగతినీ బాలయ్యకు బొత్స గుర్తు చేశారు.