సింగరేణి (Singareni) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో ఇవాళ మహాధర్నా జరగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR)పిలుపు మేరకు ప్రధాని మోదీ (PM Modi) కి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
సింగరేణి (Singareni) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో ఇవాళ మహాధర్నా జరగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR)పిలుపు మేరకు ప్రధాని మోదీ (PM Modi) కి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సింగరేణిలోని బొగ్గు బ్లాకుల(Coal blocks)ను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడంపై మండిపడుతున్నది. కొత్తగూడెం (Kothagudem), రామగుండం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, లో మహాధర్నాలు(Mahadharnas) చేపట్టారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్‌ల(Open casts)పై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం (Central Govt) సింగరే ణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని, సింగరేణిలో బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ కేంద్రం మాత్రం కుట్ర పూరితంగా బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి పూనుకుందన్నారు. తెలంగాణ ప్రజలు, బొగ్గుగని కార్మికులు సత్తుపల్లి, శ్రావణపల్లి, పెనుగడప, శాంతిఖని బ్లాకులకు మళ్లీ టెండర్లకు పిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నాలుగు బొగ్గు బ్లాకులను కేటాయించాలని టీబీజీకేఎస్ (TBGKS) డిమాండ్ చేశారు. తెలంగాణ (Telangana) ప్రజల బ్రతుకులను ఆగం చేయాలనే దురుద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం పదేపదే సింగరేణి ప్రైవేటీకరకు కుట్రలు కొనసాగిస్తోందని వారు ఆరోపించారు. లాభాలబాటలో ఉన్న సింగరేణికి భవిష్యత్‌లో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బారినపడే విధంగా చేస్తోందన్నారు.