ప్రముఖ హీరోయిన్ నయనతార (Nayanthara) అభిమానిపై చిందులేసిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు వీడియో తీస్తుండడంతో ఆగ్రహంతో ఉగిపోయిన నయన్..వీడియో తీయడం తక్షణం ఆపకుంటే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించారు.
ప్రముఖ హీరోయిన్ నయనతార (Nayanthara) అభిమానిపై చిందులేసిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు వీడియో తీస్తుండడంతో ఆగ్రహంతో ఉగిపోయిన నయన్..వీడియో తీయడం తక్షణం ఆపకుంటే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించారు. హనుమాన్ జయంతి(Hanuman Jayanti)ని పురస్కరించుకుని భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి తంజావూరులోని తమ కులదైవం ఆలయాన్ని నయన్ సందర్శించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.
వారిని నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాలేదు. ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు తరలి రావడంతో స్పందించిన విఘ్నేశ్ శివన్ (Vignesh Sivan) వారికి అభివాదం చేసి తమను ప్రశాంతంగా పూజలు చేసుకోనివ్వాలని కోరారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో తోపులాట జరిగింది. దీంతో నయన్ పూజ అనంతరం బయటకు వచ్చేసి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా అక్కడ అభిమానులతో ఫొటోలు కూడా దిగారు. అనంతరం అక్కడి నుంచి రైలులో తిరిగి బయలుదేరారు. అయితే, నయన్ రైలులోకి ఎక్కిన వెంటనే ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. ఆమెతో సెల్ఫీ వీడియో (Selfie video) తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్పటికే కోపంగా ఉన్న నయన్.. వీడియో తీయడం ఆపకుంటే ఫోన్ పగలగొట్టేస్తానని హెచ్చరించారు.