»Final Written Tests For Si Posts Today Dgp Key Instructions For Candidates
TSLPRB : నేడే ఎస్ఐ పోస్టులకు తుది రాత పరీక్షలు..అభ్యర్థులకు డీజీపీ కీలక సూచనలు !
తెలంగాణలో ఎస్ఐ పోస్టులకు తుది రాత పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) అన్ని ఏర్పాట్లు చేసింది .నేడు అర్థమెటిక్ (Arithmetic) అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ(Reasoning/Mental Ability) పేపర్ ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు, సెకండ్ షిఫ్ట్ 2.30 గంటల నుంచి 5.30 ఇంగ్లీష్ పేపర్ (English paper) ఉంటుంది. ఆదివారం ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జనరల్ స్టడీస్, సెకండ్ షిఫ్ట్ 2.30 గంటల నుంచి 5.30 వరకు లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది.
తెలంగాణలో ఎస్ఐ పోస్టులకు తుది రాత పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) అన్ని ఏర్పాట్లు చేసింది .నేడు అర్థమెటిక్ (Arithmetic) అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ(Reasoning/Mental Ability) పేపర్ ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు, సెకండ్ షిఫ్ట్ 2.30 గంటల నుంచి 5.30 ఇంగ్లీష్ పేపర్ (English paper) ఉంటుంది. ఆదివారం ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జనరల్ స్టడీస్, సెకండ్ షిఫ్ట్ 2.30 గంటల నుంచి 5.30 వరకు లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. ఎగ్జామ్ బుక్ (Exam book) లెట్ ప్రింట్ ఇంగ్లీష్/ తెలుగు, ఇంగ్లీష్/ఉర్దూ.. రెండు భాషల్లో ఉంటుందని బోర్డు అభ్యర్థులకు సూచించింది.
బయోమెట్రిక్ (Biometric) విధానం ఉండడం వల్ల చేతులకు టెంపరరీ టాటూలు, మెహందీలు ఉండకూడదని బోర్డు తెలిపింది. ఎగ్జామ్ కేంద్రానికి హాల్ టికేట్తో పాటు ఒక పాస్ ఫోటో అభ్యర్థి వెంట తెచ్చుకోవాలని బోర్డు సూచించింది. అయితే, 8వ తేదీనే ప్రధాని మోదీ ( Pm Modi)హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) లో పరీక్ష రాసే ఎస్ఐ అభ్యర్థులు.. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా 2 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని హైదరాబాద్ పోలీసులు అభ్యర్థులకు సూచించారు. మోదీ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ (Secunderabad) పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ప్రభావం నగరం అంతటా పడే అవకాశం ఉండడం చేత అభ్యర్థులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది.
దాదాపు అన్ని రోడ్డులు బిజీగా ఉండే అవకాశం ఉన్నందున తమ పరీక్షా కేంద్రాలకు రెండు గంటల ముందే వెళ్లేలా అభ్యర్థులు ప్లాన్ చేసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) సూచించారు. ట్రాఫిక్ పోలీసులకు, ఎస్ఐ అభ్యర్థులకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని ఒక ప్రకటనలో కోరారు. ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతక కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్(General Studies) పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్సీటీ కానిస్టేబుల్(IT&CO) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహించనున్నారు.