»Sunrisers Hyderabad Is The Same Story Second Defeat In A Row
IPL-16 : సన్‌రైజర్స్ హైదరాబాద్‌ది అదే కథ.. వరుసగా రెండో పరాజయం
సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ఐపీఎల్ -16లో వరుసగా రెండో పరాజయం చవిచూసింది.లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) తో మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 (IPL-16) వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి నిరాశపరిచింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ఐపీఎల్ -16లో వరుసగా రెండో పరాజయం చవిచూసింది.లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) తో మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 (IPL-16) వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి నిరాశపరిచింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులు సాధించింది. లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి విజయం అందుకుంది. ఎస్ఆర్హెచ్ (SRH) నిర్దేశించిన లక్ష్యాన్ని లఖ్‌నవూ 16 ఓవర్లలోనే ఛేదించేసింది. కెప్టెన్ రాహుల్(35), కృనాల్ పాండ్య(34) మెరుగ్గా రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో అదిల్ రషిద్ రెండు వికెట్లు తీశారు. ఉమ్రాన్, భువనేశ్వర్, ఇంపాక్ట్ ప్లేయర్ ఫరూఖి తలో వికెట్ పడగొట్టారు.హైదరాబాద్ నిర్దేశించిన స్వల్ప లక్ష్య ఛేదనను లఖ్‌నవూ ప్రారంభించింది.
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్(KL Rahul), మయేర్స్ బరిలోకి దిగారు. బ్యాటర్ రాహుల్ త్రిపాఠి బదులు ఫరూఖిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా హైదరాబాద్ తీసుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న కేల్ మేయర్స్(Cale Meyers) (13) ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ఫరూఖి బౌలింగ్‌లో (4.3వ ఓవర్) బౌండరీ లైన్ వద్ద మయాంక్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మేయర్స్ పెవిలియన్‌కు చేరాడు. తన బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన దీపక్ హుడాను (7) భువనేశ్వర్(Bhubaneswar) అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకోవడం విశేషం. మూడోవికెట్‌కు కృనాల్ పాండ్య, కేఎల్ రాహుల్ అర్ధశతక భాగస్వామ్యం నిర్మించారు. ఉమ్రాన్ మాలిక్ (Umran Malik)వేసిన అద్భుతమైన బంతికి కృనాల్ (34) కీపర్ చేతికి చిక్కాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (35) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. డీఆర్ఎస్కు వెళ్లినా ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. అదిల్ రషీద్ వరుసగా రెండో వికెట్ తీశాడు. రొమారియో షెఫెర్డ్ (0)ను ఎల్బీ చేశాడు. స్టోయినిస్(10*), నికోలస్ పూరన్(11*) జట్టును విజయతీరాలకు చేర్చారు.తన మూడో మ్యాచ్ ను సన్ రైజర్స్ ఎల్లుండి (ఏప్రిల్ 9)న పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. హైదరాబాదు ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. మరి సొంతగడ్డపై అయినా సన్ రైజర్స్ గెలుపు బోణీ కొడుతుందేమో చూడాలి.