»During Pm Modi Visit Posters Were Shown At Hyderabad
Modi tour ముందు పోస్టర్స్ కలకలం.. ఈ సారి ఇలా..?
మరికొన్ని గంటల్లో రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తున్నారు. ఇంతలో హైదరాబాద్లో మరో భారీ ప్లెక్సీ వెలిసింది. మోడీ కుటుంబం స్వాగతం చెబుతోంది అని పైన రాసి ఉంది. అందులో రాజకీయ నేతలు తండ్రులు/ కుమారులు- కుమార్తెలు ఉన్నారు.
During Pm Modi visit, posters were shown at hyderabad
Pm Modi:మరికొన్ని గంటల్లో రాష్ట్రానికి ప్రధాని మోడీ (pm modi) వస్తున్నారు. హిందీ పేపర్ లీకేజీ, టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంతో రాష్ట్రంలో వాతావరణం హీటెక్కింది. ఇటు హైదరాబాద్లో మరో భారీ ప్లెక్సీ (flexi) వెలిసింది. మోడీ కుటుంబం (modi family) స్వాగతం చెబుతోంది అని పైన రాసి ఉంది. అందులో తండ్రులు/ కుమారులు- కుమార్తెలు ఉన్నారు.
మాజీమంత్రి వేద్ ప్రకాశ్ గోయల్ ఆయన కుమారుడు పీయూష్ గోయల్, కేంద్రమంత్రి అమిత్ షా- కుమారుడు జై షా, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్- పంకజ్ సింగ్, మాజీ మంత్రి దేబేంద్ర ప్రధాన్- కుమారుడు ధర్మేంద్ర ప్రదాన్, మాజీ సీఎం ప్రేమ్ కుమార్- కుమారుడు అనురాగ్ ఠాకూర్ ఇలా చాలా మంది ఉన్నారు. వారిలో గౌతమ్ అదానీ- కరన్ అదానీ, ముఖేశ్ అంబానీ- అనంత్ అంబానీ ఉన్నారు.
వీరంతా తండ్రి నుంచి వారసత్వంగా ఎన్నికైన వారు అని.. పరివార్ (కుటుంబం) అని చెప్పేలా పోస్టర్ ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్ ఆలోజింప చేస్తోంది. ఇటీవల హైదరాబాద్లో వరసగా ప్లెక్సీలు దర్శనం ఇచ్చిన సంగతి తెలిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో కవిత పోస్టర్స్ కూడా వెలిశాయి.
ప్రధాని నరేంద్ర మోడీ (modi) రేపు హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వందే భారత్ రైలు ప్రారంభం.. ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో బీఆర్ఎస్ నేతలు నిరసనలకు సిద్ధం అవుతున్నారు.