question paper తీసుకొని చంపుతానని బెదిరించాడు, ఫొటోలు తీసుకుని ఇచ్చేశాడు
పదో తరగతి హిందీ పేపర్ లీక్ జరిగడానికి కారణమైన స్టూడెంట్ను డిబార్ చేశారు. ఐదేళ్లపాటు పరీక్ష రాసేందుకు వీలులేదని డీఈవో స్పష్టంచేశారు. దీంతో బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. తన తప్పు ఏం లేదని చెబుతున్నాడు.
SSC Paper leak:పదో తరగతి హిందీ పేపర్ లీక్ (hindi paper leak) అంశం తెలంగాణ రాష్ట్రంలో పెను దుమారం రేపింది. బండి సంజయ్ (bandi sanjay) అరెస్ట్, జైలు నుంచి విడుదల.. ఈటల రాజేందర్‌కు (etala rajender) పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ జరిగిన స్టూడెంట్ను డిబార్ చేశారు. ఐదేళ్లపాటు పరీక్ష రాసేందుకు వీలులేదని డీఈవో స్పష్టంచేశారు. దీంతో బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. తన తప్పు ఏం లేదని.. కిటికీ పక్కన కూర్చొగా ఒకడు వచ్చి పేపర్ లాక్కున్నాడని చెప్పాడు.
పేపర్ ఇవ్వకుంటే చంపుతానని బెదిరించాడని తెలిపాడు. గత్యంతరం లేక పేపర్ ఇచ్చానని.. అతను ఫోటోలు (photo) తీసుకుని.. పేపర్ తనకు ఇచ్చేశాడని చెప్పాడు. తనను అన్యాయంగా డిబార్ చేశారని వాపోయాడు. తన తప్పు ఏం లేదని.. బెదిరించడంతో పేపర్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. తన గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నాడు.
హనుమకొండ కమలాపూర్ (kamalapur) మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి గురువారం పరీక్ష రాసేందుకు జెడ్పీ హై స్కూల్ వద్దకు వచ్చాడు. పరీక్ష రాసేందుకు హన్మకొండ డీఈవో అనుమతించలేదు. నీ వల్ల ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారని.. డిబార్ అయ్యావని చెప్పాడు. పరీక్ష రాసేందుకు అనుమతి లేదని చెప్పి పంపించడంతో.. ఆ విద్యార్థి బోరుమని విలపించాడు.
ఓ పిల్లాడు వచ్చి పేపర్ తీసుకొని.. ఫోటో తీసుకున్నాడు. అలా పేపర్ లీక్ చేశారు. బండి సంజయ్‌కు పేపర్ రావడంతో.. లీకేజీ ఇష్యూలో ఆయనను ఏ-1 చేర్చి అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ కూడా విధించగా.. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు ఇచ్చింది. ఈటల రాజేందర్ సోమవారం రోజున డీసీపీ ముందు విచారణకు హాజరవుతారు.