actress kushbu infected flu, admitted to hyderabad apollo
kushbu:సినీ నటి ఖుష్బు (kushbu) అనారోగ్యానికి గురయ్యారు. ఆమె ప్లూతో బాధపడుతున్నారు. జ్వరం (fever), ఒళ్లు నొప్పులు (body pains) ఎక్కువగా ఉన్నాయట. దీంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో (apollo hospital) చేరారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫ్లూ (flu) వల్ల ఇబ్బంది పడ్డా.. అందుకే ఆస్పత్రిలో చేరానని పేర్కొంది. మీకు ఫ్లూ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. ఆస్పత్రి బెడ్ మీద ఉన్న ఫోటోను ఖుష్బు షేర్ చేశారు.
ఖుష్బు ట్వీట్ చేయడంతో ఆమె ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఖుష్బు అంటే తమిళనాడులో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. కొందరు ఆమెకు గుడి కట్టి తమ భక్తిని చాటుకున్నారు.
ఖుష్బు (kushbu) ఇటీవల మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులు అయ్యారు. మమతా కుమారి, టెలినా కంగ్ డోబ్ను కూడా నియమించారు. మంచి నటిగా గుర్తింపు పొందారు. 2010లో డీఎంకే (dmk) పార్టీలో చేరారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో (congress) చేరారు. 2020 వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. తర్వాత బీజేపీలో (bjp) చేరారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
తన తండ్రి చిన్నప్పుడు లైంగికంగా వేధించాడని ఇటీవల ఖుష్బు హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చేసిన అతనికి లేని భయం.. తనకెందుకు అని చెప్పారు.