సికింద్రబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
BJP has announced the MLA candidate for Sikindrabab Cantonment
BJP: సికింద్రాబాబ్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి తాజాగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ స్థానం నుంచి వంశా తిలక్ ను తమ అభ్యర్థిగా బీజేపీ ఖారారు చేసింది. ఇటీవలే ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున లాస్య నందిత ఎన్నికై, దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇప్పటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీగణేశ్ పోటీలో ఉన్నారు. అలాగే లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ తరఫున వంశా తిలక్ పోటీలో ఉన్నారు. మే 13న లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది.