Summer Special Trains : రానున్న సెలవుల సీజన్లో రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను(special trains) ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. కేరళలోని కొల్లం, పశ్చిమ బెంగాల్లోని షాలిమార్, సాంత్రాగాచిలకు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్ – షాలిమార్ ప్రత్యేక రైలు(special train) ఏప్రిల్ 15 నుంచి జూన్ 24వ తేదీ వరకు ప్రతి సోమవారం ఉంటుంది. అలాగే ప్రతి మంగళవారం షాలిమార్ – సికింద్రాబాద్ రూట్లో మరో రైలు రాకపోకలు సాగిస్తుంది. ఏప్రిల్ 16 నుంచి జూన్ 25 వరకు ఇది ఈ రూట్లో ప్రయాణిస్తుంది. అలాగే సికింద్రాబాద్ – సాంత్రాగాచి రైలు ప్రతి శుక్రవారం ఉంటుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 29 వరకు ఇది మొత్తం 11 ట్రిప్పులు వేస్తుంది. ప్రతి శనివారం ఈ రైలు సాంత్రాగాచి – సికింద్రాబాద్కు తిరుగు ప్రయాణమవుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడెంలలో ఆగుతుంది. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
అలాగే సికింద్రాబాద్ – కొల్లం మధ్య మరో ప్రత్యేక రైలు తిరుగుతుంది. ఇది ఏప్రిల్ 17, 24, మే 1,8,15,22,29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం -సికింద్రాబాద్(Kollam-secunderabad) రైలు ఏప్రిల్ 19, 26, మే 3,10,17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ రైలు తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు.