Samantha : చైతూని ఎందుకు మోసం చేశావన్న నెటిజన్.. సమంత స్ట్రాంగ్ రిప్లై
నాగ చైతన్య, సమంత జంటకు చాలా మంది అభిమానులు ఉన్నారు. వారిద్దరూ విడిపోయినప్పుడు అంతా చాలా బాధ పడ్డారు కూడా. అయితే తాజాగా ఓ అభిమాని ఈ విషయమై సమంతను ప్రశ్నించాడు. దీంతో ఆమె అతడికి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమందంటే?
Samantha, Naga Chaitanya : టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు పొందిన సమంత (Samantha), అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) తమ వైవాహిక బంధానికి ముగింపు పలికి విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి జంటను ఎంతగానో ఇష్టపడే అభిమానులు ఈ విషయమై ఎంతో బాధ పడ్డారు. అయితే తాజాగా ఓ నెటిజన్(Netijen) సమంతను ట్యాగ్ చేస్తూ కాస్త ఇబ్బందికరంగా ప్రశ్నించాడు. నీ అమాయకమైన భర్తను ఎందుకు మోసం చేశావు? అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌ని చూసిన సమంత కూడా అతడికి అంతే స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది. ‘సారీ ఇలాంటి ఆరోపణలు చేయడం మీకు ఏ విధంగానూ సహాయపడదు. మీకు ఇంకా బలమైనవేవో కావలి. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ సామ్ కామెంట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ నెట్లో తెగ వైరల్‌గా మారింది.
నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తుండగా.. సమంత వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆర్యోగం సహకరించకపోవడంతో సినిమాలు చేయడం తగ్గించింది. నాగ చైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషి’ తరువాత ఆమె మళ్లీ వెండితెర మీద కనిపించింది లేదు. ఖుషీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సమంత..4ఇప్పుడు మళ్లీ షూట్లతో బిజీ బిజీగా మారింది. సోషల్ మీడియాలో తాజాగా వచ్చిన ఈ ట్వీట్‌కి సామ్ గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో ఇది నెట్టింట చక్కర్ల కొడుతోంది.