»Secunderabad Tirupati Vande Bharat Express Ticket Fare Timings Stoppages Other Details
హైదరాబాద్-తిరుపతి మధ్య Vande Bharat Express ధరలు
తెలంగాణతో ఏపీలోని ప్రధాన నగరాలకు వెళ్లేందుకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వందే భారత్ ప్రారంభించగా.. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు ప్రారంభమైంది.
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం వేగవంతం కానుంది. తెలంగాణతో (Telangana) ఏపీలోని ప్రధాన నగరాలకు వెళ్లేందుకు వందే భారత్ రైళ్లు (Vande Bharat Express) అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో హైదరాబాద్ (Hyderabad) నుంచి విశాఖపట్టణానికి వందే భారత్ ప్రారంభించగా.. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఈ రైలును అట్టహాసంగా ప్రారంభించారు. అయితే ఈ రైలు ఎన్ని స్టేషన్లు ఆగుతుంది..టికెట్ ధర (Ticket Price), ఎన్ని సీట్లు (Seats) ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. వందే భారత్ రైలులో ప్రయాణించాలంటే వాటి వివరాలు తెలుసుకోవాల్సిందే. తాజాగా ఈ రైలు ధరలను భారత రైల్వే ప్రకటించింది.
సెమీ హైస్పీడ్ రైలుగా పేర్కొనే వందే భారత్ రైలు తిరుపతికి అందుబాటులోకి రావడంతో భక్తులతో పాటు ఏపీ ప్రజలు (AP People) హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ -తిరుపతికి 8.30 గంటల ప్రయాణ సమయం ఉండనుంది. ఏప్రిల్ 9న తిరుపతి నుంచి వందే భారత్ హైదరాబాద్ కు చేరుకోనుంది. 10వ తేదీన హైదరాబాద్ లోని సికింద్రాబాద్ (Secunderabad) నుంచి రైలు తిరుపతికి బయల్దేరుతుంది. మంగళవారం మినహా ప్రతి రోజూ వందే భారత్ రైలు ప్రజలకు అందుబాటులో ఉండనుంది.
టికెట్ల ధరలు
సికింద్రాబాద్ నుంచి తిరుపతి
ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,680
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.3,080
తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.3,030
సాధారణ ధర రూ.1,168గా ఉంది. వీటికి అదనంగా రిజర్వేషన్ చార్జీ రూ.40, సూపర్ ఫాస్ట్ చార్జీ రూ.45, మొత్తం జీఎస్టీ రూ.63, ఆహార పదార్థాలకు రూ.364గా ఒక్కో ప్రయాణికుడి నుంచి వసూలు చేస్తున్నారు.
సికింద్రాబాద్- నల్గొండ రూ.470
సికింద్రాబాద్- గుంటూరు రూ.865
సికింద్రాబాద్- ఒంగోలు రూ.1,075
సికింద్రాబాద్- నెల్లూరు రూ.1,270
సికింద్రాబాద్- తిరుపతి రూ.1,680
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ చార్జీలు
సికింద్రాబాద్- నల్గొండ రూ.900
సికింద్రాబాద్- గుంటూరు రూ.1,620
సికింద్రాబాద్- ఒంగోలు రూ.2,045
సికింద్రాబాద్- నెల్లూరు రూ.2,455
సికింద్రాబాద్- తిరుపతి రూ.3,080
కాగా రైలు ప్రయాణ సమయం ఇలా ఉంది. హైదరాబాద్ లో ఉదయం 6 గంటలకు బయల్దేరుతుండగా తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45కు చేరుకుంటుంది.
సమయపాలన (Timings)
సికింద్రాబాద్-తిరుపతి (20701): సికింద్రాబాద్ ఉదయం 6.00, నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09. నెల్లూరు 12.29, తిరుపతి 14.30
తిరుపతి-సికింద్రాబాద్ (20702): తిరుపతి రాత్రి 15.15, నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్ 23.45.