Twitter Logo : ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటికి అనేక మార్పులు చేశాడు. ఎలాన్ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే..ఎప్పుడు సంచలన నిర్ణయాలతో వార్తల్లోకెక్కే ట్విట్టర్ అధినేత మూడురోజులనుండి వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు.
ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటికి అనేక మార్పులు చేశాడు. ఎలాన్ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే..ఎప్పుడు సంచలన నిర్ణయాలతో వార్తల్లోకెక్కే ట్విట్టర్ అధినేత మూడురోజులనుండి వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి అనేక సందర్భాల్లో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. చాలాయేళ్లగా పనిచేస్తున్న ట్విట్టర్ సిబ్బందిని తగ్గించి మొదట వార్తల్లోకెక్కారు. ఆతర్వాత లోగో మార్పు అంటూ మరోసారి వార్తల్లోకెక్కారు.
మూడు రోజుల కిందట ట్విటర్ లోగో ను ఛేంజెస్ చేశాడు. ట్విటర్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది బ్లూ బర్డ్ లోగో. కానీ ఆ లోగోని తీసేసి దాని ప్లేసులో కుక్కు లోగోను పెట్టాడు..సోమవారం అర్థరాత్రి ట్విట్టర్ కొత్త లోగో సంబంధించి పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది క్రిప్టో కరెన్సీ లోగోను పోలి ఉంది. ట్విట్టర్ లోగో మార్పుపై నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇప్పుడు మరోసారి లోగోను మార్చాడు దాని స్థానంలో బ్లూ బర్డ్ లోగోని తీసుకొచ్చారు. మూడు రోజుల అనంతరం తిరిగి ట్విటర్ లోగోగా బ్లూబర్డ్ను పునరుద్ధరించడంతో కుక్క బొమ్మ కనుమరుగైంది. దీంతో బ్లూబర్డ్ తిరిగి తన సొంతగూటికి చేరిందని నెటిజన్లు అంటున్నారు. క్రిప్టోలో ఎలాన్ మస్క్‌కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయని, డోజికాయిన్ విలువను పెంచేందుకే ట్విట్టర్ లోగో కింద ఉన్న పక్షిని మార్చి డోజీమీమ్ను పెట్టారని సోషల్‌మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.