ఏపీ ప్రభుత్వంపై హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) తమతో టచ్ లో ఉన్నారన్నారు. ఏపీలో ఉంది చెత్త ప్రభుత్వమని, రాష్ట్రంలో డ్రగ్స్, ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని ఆరోపించారు. నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర కోసం బాలయ్య అక్కడికి వెళ్లారు. రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలన్నది వైసీపీ కుట్ర అని కూడా మండిపడ్డారు. జనం అంటే వైసీపీకి లెక్కలేదని, జగన్ కు పాలన చేతకాదన్నారు. వైస్సార్సీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని విమర్శించారు. అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.‘జగన్ సీఎం (Jagan CM) అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు రాలేదు.. ఉపాధి కల్పన జరగలేదు.
రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్ మాఫియా (Sand Mafia) రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. వైస్సార్సీపీ ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసు. ఆ పార్టీ అరాచకాలను ఎదిరించేందుక ప్రజలంతా ముందుకు రావాలి. టీడీపీ (TDP) పాలన మళ్లీ వస్తుంది.. అందరి సమస్యలు పరిష్కరిస్తుంది’’ అని బాలయ్య అన్నారు. జనం అంటే జగన్ కు కక్ష అన్న బాలయ్య.. అదోరకం సైకోతత్వమని అన్నారు. తాను సైకాలజీ (Psychology) చదవలేదని, కానీ తానో పెద్ద సైకాలజిస్ట్ అని చెప్పుకొచ్చారు. టీడీపీ హాయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు (Tidco Houses) జనాలకు ఇవ్వలేదని, ఇప్పుడు ఇచ్చిన తీసుకోవద్దు అని ప్రజలకు సూచించారు. టిడ్కో ఇళ్లు కూలిపోయి జనాలు చనిపోతారని అన్నారు. మెయింటన్స్ లేక ఇళ్లు పాడయ్యాయని బాలయ్య తెలిపారు.