»Aishwarya Rai And Abhishek Bachchan To Take Divorce
Abhi-Aish విడిపోతున్నారా..? రూమర్లకు కారణమిదే..? కానీ
సెలబ్రిటీ కపుల్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ డైవర్స్ తీసుకుంటున్నారని మరోసారి చర్చకు వచ్చింది. గతంలో కూడా రూమర్స్ రాగా.. వాటిని ఇద్దరూ కొట్టిపారేశారు. ఇప్పుడు మరోసారి రూమర్స్ వస్తున్నాయి.
Aishwarya rai and Abhishek bachchan to take divorce
Abhi-Aish:సెలబ్రిటీ కపుల్ ఐశ్వర్యరాయ్ (Aishwarya rai)-అభిషేక్ బచ్చన్ (Abhishek bachchan) విడిపోతున్నారా..? వారిద్దరూ డైవర్స్ తీసుకుంటున్నారని మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పుడే కాదు గతంలో కూడా రూమర్స్ రాగా.. వాటిని ఇద్దరూ కొట్టిపారేశారు. తమ మధ్య విభేదాలు ఏమీ లేవని స్పష్టంచేశారు. ఇప్పుడు మరోసారి రూమర్స్ వస్తున్నాయి.
గత కొన్నిరోజులుగా పార్టీలు, ఫంక్షన్లకు ఐశ్వర్యరాయ్ (Aishwarya rai) ఒక్కరే వస్తున్నారు. ఇటీవల జరిగిన నీతా అంబానీ (nita ambani) కల్చరల్ సెంటర్ ఈవెంట్కు కూడా ఐష్.. కూతురుతో వచ్చారు. భర్త అభిషేక్ బచ్చన్ మాత్రం రాలేదు. ముంబైలో జరిగిన ఈవెంట్స్, ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో ఐశ్వర్య (Aishwarya) ఒక్కరే వస్తున్నారు. దీంతో వారిద్దరీ మధ్య పొసగడం లేదా అనే చర్చ వస్తోంది. విడిపోతున్నారా అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఐశ్వర్య-అభిషేక్.. ఎవరి ప్రొఫెషనల్ లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. పార్టీ, ఫంక్షన్లకు కలిసి వెళ్లాలి.. కలిసి రావాలనే రూల్ ఏం లేదు. ఐశ్వర్య (Aishwarya ) వెంట అభి లేకపోవడంతో ఏదో ఉందని కథలు అల్లి బాలీవుడ్ మీడియా కథనాలు రాస్తోంది. నీతా అంబానీ కార్యక్రమానికి సంబంధించి ఓ అభిమాని ఐస్, ఆరాధ్య ఫోటోలను షేర్ చేశారు. వీరిద్దరూ తనకు చాలా ఇష్టం అని యూజర్ రాయగా.. నాకు కూడా అని అభిషేక్ కామెంట్ చేశారు. బ్లష్ ఫేస్ ఎమోజీ పెట్టారు.
ఐష్-అభి ప్రేమించి 2007 ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2011 సంవత్సరంలో ఆరాధ్య జన్మించింది. వీరిద్దరూ కలిసి ఉమ్రాన్ జాన్, గురు, కుచ్ నా కహో, రావణ్ సినిమాల్లో నటించారు. అంతకుముందు అభిషేక్ బర్త్ డేకు ఐశ్వర్య.. ‘నా ప్రేమకు బర్త్ డే, ఈ రోజు.. ఇప్పటికీ, ఎప్పటికీ బేబీ’ అంటూ ట్వీట్ చేసింది.
మణిరత్నం పొన్నియన్ సెల్వన్-2లో ఐశ్వర్య (Aishwarya)నటిస్తున్నారు. ఆ సినిమా ఈ నెల 28వ తేదీన తమిళ్, హిందీ, తమిళ్, మళయాళం, కన్నడ భాషలో విడుదల కానుంది. కల్కి కృష్ణమూర్తి పాపులర్ నవల ‘ద సన్ ఆఫ్ ఫొన్ని’ని రెండు భాగాలుగా సినిమాగా తెరకెక్కించారు. అభిషేక్ బచ్చన్ ‘భోళా’ అనే సినిమా ఇటీవల రిలీజ్లో అయ్యింది. ఇదీ కామెడీ జోనర్ మూవీ.