»Kcr Skips For The Fifth Time Pm Modis Program Again In Telangana Netizens Are Angry With The Cm Kcr 2023
PM Modi: కార్యక్రమానికి KCR ఐదోసారి డుమ్మా…నెటిజన్ల ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్(hyderabad) వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) కార్యక్రమానికి సీఎం కేసీఆర్(cm kcr) ఐదోసారి హాజరుకాలేదు. బేగంపేట విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్‌ను పంపారు. దీంతో ఈ అంశంపై నెటిజన్లు కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఈరోజు(aprial 8th 2023) హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని(pm modi) మళ్లీ తెలంగాణ సీఎం కేసీఆర్(telangana cm kcr) కలవకుండా దాటవేశారు. ఇలా చేయడం కేసీఆర్ కు ఐదవసారి కావడం విశేషం. ఇప్పటికే అనేక సార్లు కేసీఆర్ రాష్ట్ర ప్రతినిధిగా హాజరుకాకుండా ఇతరులను పంపించారు. తాజాగా మళ్లీ కేసీఆర్ హాజరు కాకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పంపడం పట్ల పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నిధులు ఇస్తూ పలు కార్యక్రమాలను చేపడుతున్నా కూడా కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని మరోవైపు నెటిజన్లు సైతం మండి పడుతున్నారు.
గత 14 నెలల్లో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ప్రధానిని సీఎం కేసీఆర్ అధికారిక హోదాలో ఆహ్వానించలేదు. కేసీఆర్ చివరిసారిగా సెప్టెంబరు 2021లో ప్రధాని మోదీని కలిశారు. అది ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమం. ప్రోటోకాల్ ప్రకారం, ముఖ్యమంత్రి తప్పనిసరిగా విమానాశ్రయంలో ప్రధానిని రిసీవ్ చేసుకోవాలి. కానీ కేసీఆర్(kcr) 2022 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రధానిని కలవడం లేదు.
మరోవైపు పలు మార్లు కేసీఆర్ రాకపోయినప్పటికీ కూడా ప్రోటోకాల్‌ను అనుసరించి ప్రధానమంత్రి(primeminister) కార్యక్రమాలలో పాల్గొనాలని కేసీఆర్‌ను ప్రతిసారీ ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రకనటనలు జారీ చేస్తున్నారు. ఆ క్రమంలో మోదీ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీని ఆహ్వానించడానికి కేసీఆర్ రావడం లేదని సీఎం ఆఫీస్ నుంచి సమాధానం రావడం విశేషం.
ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్(hyderabad) చేరుకున్న ప్రధాని మోదీ సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రూ.11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో పాటు రైల్వేకు సంబంధించిన ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. ఎయిమ్స్ బీబీనగర్, ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.