NZB: కనుమ పండుగను పురస్కరించుకుని చందూర్ గోశాలలో గోమాతలకు ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయ అర్చకులు నందు పంతులు మాట్లాడుతూ.. కనుమ సందర్భంగా గోమాతలకు పూజలు చేయడం శుభమకరమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవ రెడ్డి, గోశాల నిర్వాహకులు వరప్రసాద్, దాకడి సాయిలు, సుమంత్ రెడ్డి, సాయిలు పాల్గొన్నారు.