»Corona Spreading Again In The India 6155 Cases In One Day April 8th 2023
Covid Update: దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా..ఒక్క రోజే 6,155 కేసులు
ఇండియా(india)లో మళ్లీ కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తుంది. క్రమ క్రమంలో కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో గత 24 గంటల్లో కొత్తగా 6,155 కరోనా కేసులు(covid update) నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా 5.63 శాతానికి పెరిగింది.
దేశంలో(india) మళ్లీ కరోనా కేసులో పెద్ద ఎత్తున పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు(covid cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 31,194 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. మరోవైపు రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా 5.63%కి చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కేరళ(kerala)లో అత్యధికంగా 10,609 యాక్టివ్ కేసులు ఉండగా, మహారాష్ట్రలో 4,487, గుజరాత్లో 2,155, ఢిల్లీలో 2,331, కర్ణాటకలో 1,596, తమిళనాడులో 1530, హిమాచల్ ప్రదేశ్లో 1347 కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు 44.9 మిలియన్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో 11 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 530,959కు చేరింది. మరోవైపు దాదాపు 4,41,89,111 మంది కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కోవిడ్ రికవరీ రేటు 98.76%కి చేరుకుంది. దేశంలో గత 24 గంటల్లో 1,09,378కి పైగా పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం ప్రతి 4-5 రోజులకు కోవిడ్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోందని వైద్యులు(doctors) చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు 6,000 కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కేసుల పెరుగుదలకు XBB.1.16 కోవిడ్-19 వేరియంట్ కారణమని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఇన్ఫ్లుఎంజా వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను పర్యవేక్షించడం సహా ఆయా ప్రాంతాలను గుర్తించాలని కేంద్రం(central government) అధికారులను ఆదేశించింది. దీంతోపాటు కోవిడ్-19, ఇన్ఫ్లుఎంజా పరీక్షల కోసం నమూనాలను కూడా పంపాలని కోరింది. మరోవైపు ఆసుపత్రి పడకల లభ్యతతో సహా అన్ని లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించారు. ప్రత్యేకించి వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది.