»2994 New Covid Cases In The India 9 Deaths April 1st 2023
Covid Update: దేశంలో కొత్తగా 2,994 కోవిడ్ కేసులు..9 మంది మృతి
ఇండియాలో శనివారం కొత్తగా 2,994 కరోనా వైరస్ కేసులు(covid cases) రికార్డయ్యాయి. శుక్రవారం నాటి 3095 కరోనా వైరస్ కేసులతో పోల్చుకుంటే కొంచెం తగ్గుదల కనిపించింది. మరోవైపు గత 24 గంటల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2.09 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ 2.03 శాతంగా నమోదైంది.
భారతదేశంలో శనివారం కొత్తగా 2,994 కోవిడ్ -19 కేసులు(covid cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 16,354కు చేరింది. నిన్నటి 3095 కేసులతో పోల్చితే తాజా కరోనావైరస్ కేసుల సంఖ్య గత ఆరు నెలల్లో ఒకే రోజులో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 2.09 శాతం ఉండగా.. వారం పాజిటివిటీ రేటు 2.03 శాతంగా నమోదైంది.
మరోవైపు కొత్తగా తొమ్మిది మరణాలు రికార్డు కాగా..మొత్తం మరణాల సంఖ్య 5,30,876కి పెరిగింది. ఈ నేపథ్యంలో మరణాల రేటు(death rate) 1.19 శాతంగా నమోదైంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో రెండు మరణాలు, గుజరాత్ నుంచి ఒకటి మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,71,551కు చేరింది.
గత 24 గంటల్లో మొత్తం 9,981 కోవిడ్ వ్యాక్సినేషన్(covid vaccination) డోసులు ఇవ్వబడ్డాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అనుమానం ఉంటే తప్ప యాంటీబయాటిక్స్ ఉపయోగించకూడదని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక జ్వరం/తీవ్రమైన దగ్గు, ప్రత్యేకించి 5 రోజులకు మించి ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.