ఏపీలో కరోనా(Corona)తో ఒకరు మృతి చెందారు. కుక్కునూరు మండలం కొండపల్లికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని చికిత్స కోసం మార్చి 30వ తేదిన భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కరోనా సోకి ఆ వ్యక్తి 8న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తగ్గాయనుకున్న కరోనా కేసులు(Corona Cases) మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో వైద్యులు(Doctors) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీ(AP)లో కరోనా కలకలం రేపింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు విజృంభించాయి. ఆదివారం ఏలూరు జిల్లాలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
ఏపీలో కరోనా(Corona)తో ఒకరు మృతి చెందారు. కుక్కునూరు మండలం కొండపల్లికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని చికిత్స కోసం మార్చి 30వ తేదిన భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కరోనా సోకి ఆ వ్యక్తి 8న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి స్వగ్రామం కొండపల్లిలో కుటుంబ సభ్యులతో పాటు అందరికీ కోవిడ్ టెస్టులు(Covid Tests) చేసి వారిని క్వారంటైన్ కు పంపినట్లు అధికారులు తెలిపారు.
దేశంలో ఢిల్లీ, కేరళలో కూడా కరోనా కేసులు(Corona Cases) భారీగా నమోదవుతున్నాయి. కేరళలో శనివారం ఒక్కరోజే 1801 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీలో కొత్తగా 535 మందికి కరోనా సోకింది. దేశ వ్యాప్తంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు తదితర లక్షణాలతో ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్ అయిన XBB.1.16 వేరియంట్ కారణమని పరిశోధకులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఇన్ ఫ్లూయెంజా సబ్ టైప్ హెచ్3ఎన్2(H3N2) కారణంగా కేసులు పెరుగుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.