PM Modi meets Elephant Whisperers couple at Theppakadu Elephant Camp
PM Modi meets Elephant Whisperers couple:ఎలిఫెంట్ విస్సరర్స్ (Elephant Whisperers) నటులతో ప్రధాని నరేంద్ర మోడీ (modi) కలిశారు. బొమ్మన్ (bomman), బెల్లీని (bellie) తెప్పకడు ఎలిఫెంట్ క్యాంపులో ఆదివారం మీట్ అయ్యారు. వారిద్దరితో కలిసి దిగిన ఫోటోలను మోడీ (modi) ఫేస్బుక్లో షేర్ చేశారు. బొమ్మన్, బెల్లి, రఘును (raghu) కలువడం చాలా ఆనందంగా ఉందని రాశారు.
ముదుమలై టైగర్ రిజర్వ్‌లో గల తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్‌ను ఈ రోజు ప్రధాని మోడీ (modi) సందర్శించారు. అక్కడ ఉన్న బొమ్మన్, బెల్లిని కలిశారు. ఏనుగు రఘును కూడా తాకారు. అక్కడ బొమ్మన్, బెల్లితో కాసేపు మాట్లాడారు. వీరిద్దరూ కలిసి నటించిన డాక్యుమెంటరీ ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ప్రధాని మోడీ (modi) వస్తుండటంతో ఎంటీఆర్కు కొత్త లుక్ వచ్చింది. మోడీ విమానం ల్యాండ్ అయ్యేందుకు సింగరాలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. గ్రామంలో గల రహదారిని (road) పునరుద్దరించారు. గిరిజన ప్రాంతంలో 30 ఎలక్ట్రిక్ పోల్స్ ఏర్పాటు చేసి.. విద్యుత్ సరఫరా (power) చేస్తున్నారు. ఏనుగులు స్నానం చేసే చోటును ఆధునీకరించారు.
మోడీ (modi) వస్తుండటంతో ఎంటీఆర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ ఉన్న హోటళ్లను (hotels) తాత్కాలికంగా మూసివేశారు. ఎలిఫెంట్ సఫారీ (elephant safari), టూరిస్ట్ వెహికిల్స్ (tourist vehicles) కూడా ఈ నెల 7వ తేదీ నుంచి క్లోజ్ చేశారు. రేపు (సోమవారం) నుంచి తిరిగి అన్ని యథావిధిగా తెరచుకుంటాయి.
ఎలిఫెంట్ విస్పరర్స్ (Elephant Whisperers) మూవీ బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఆ సినిమాలో ఏనుగు ‘రఘు’తో (raghu) ఆ దంపతులకు ఉన్న అనుబంధం గురించి చక్కగా చూపించారు. రఘు ఏనుగును అధికారులు తీసుకెళ్లగా మరో ఏనుగు అమ్మును (ammu) పెంచుతారు. ఈ డాక్యుమెంటరీ నెట్ ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది.