కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓ యువతి స్కూటీపై జర్నీ చేశారు. ఆ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ ఎందుకు అలా ప్రయాణించారు? మ్యాటర్ ఎంటనేది ఇప్పుడు చుద్దాం.
Rahul Gandhi ride on girl Scooty at jaipur Netizens comments
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిన్న పర్యటించారు. ఆ క్రమంలో మహారాణి కళాశాలలో మెరిట్ విద్యార్థినులకు రాహుల్ స్కూటీలను పంపిణీ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర రాజధానిలో కాంగ్రెస్ ఎంపీ ఓ అమ్మాయి స్కూటర్‌పై అలా సరదాగా రైడ్ చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా..ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఈ వీడియో చూసిన పలువురు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రాజస్థాన్ మే జన్ నాయక్ అని ఒకరు, కాబోయే యంగెస్ట్ పీఎం ఇంకొకరు వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలో మేలో రాహుల్ గాంధీ బెంగళూరులో డెలివరీ బాయ్ స్కూటర్‌పై ప్రయాణించారు.
https://x.com/ANI/status/1705497615138426939?s=20
అంతకుముందు జైపూర్ విమానాశ్రయంలో కాంగ్రెస్ ఎంపీని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర ఎన్నికల కోర్ కమిటీ కన్వీనర్ సుఖ్జీందర్ రాంధావా, పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కలిసి స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా జరిగిన బహిరంగ ర్యాలీలో కూడా ప్రసంగించారు. వెంటనే కుల గణన చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కులగణన చేపట్టుకుండా ఓబీసీలకు ప్రాతినిధ్యం కల్పించడం సాధ్యం కాదన్నారు. 24 గంటలు ఓబీసీల గురించి మాట్లాడే మోడీ(modi) కుల గణన చేపట్టేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.