»Pm Narendra Modi Varanasi Nari Shakti Vandan Abhinandan Program Speech
PM Modi: ప్లేగ్రౌండ్ నుండి రాఫెల్ వరకు ప్రతీ దాంట్లో మహిళలు అద్భుతాలు చేస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి చేరుకున్నారు. రాజతలాబ్లో నిర్మించనున్న కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేసిన అనంతరం, సంపూర్ణానంద విశ్వవిద్యాలయంలో నారీ శక్తి వందన్ అభినందన కార్యక్రమంలో ప్రసంగించారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి చేరుకున్నారు. రాజతలాబ్లో నిర్మించనున్న కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేసిన అనంతరం, సంపూర్ణానంద విశ్వవిద్యాలయంలో నారీ శక్తి వందన్ అభినందన కార్యక్రమంలో ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్‌తో పాటు అనేక ఇతర పథకాలను ప్రధాని మోడీ ప్రస్తావించారు. బనారస్‌లోని 2 లక్షల 30 వేల మందికి పైగా మహిళలు ఉజ్వల పథకం ప్రయోజనం పొందారని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రతి సిలిండర్‌పై రూ.400 సబ్సిడీ కూడా ఇస్తోంది.
మన దేశంలో మహిళల పేరుతో ఆస్తులు కొనడం చాలా తక్కువగా ఉందని, అయితే మోడీ ప్రభుత్వం మహిళల పేరుతో అనేక పథకాలు ప్రారంభించిందని ప్రధాన మంత్రి అన్నారు. నేడు మన మహిళలు ప్లే గ్రౌండ్ నుండి రాఫెల్ ఎగిరే వరకు ప్రతిచోటా అద్భుతాలు చేస్తున్నారని కొనియాడారు. మహిళలకు సమానావకాశాలు లభిస్తే అభివృద్ధి ఎంత వేగం పుంజుకుంటుందనడానికి మన బనారస్ సాక్షి. తనకు తల్లులు, సోదరీమణుల శక్తి అతిపెద్ద రక్షణ కవచంగా పేర్కొన్నారు.
బనారస్‌లోని వేలాది మంది మహిళలు ముద్రా యోజన ప్రయోజనం పొందారని ప్రధాన మంత్రి అన్నారు. ముద్రా యోజన మద్దతుతో పరిశ్రమలు కొత్త బలం పుంజుకున్నాయి. మూతపడే దశలో ఉన్న ఆ చిన్న పరిశ్రమలు నేడు వాటి ఉత్పత్తులు దేశానికి, ప్రపంచానికి వెళ్తున్నాయి. బనారస్‌లో పర్యాటకం ఉపాధిని కల్పిస్తుంది, అందులో మహిళల భాగస్వామ్యం చాలా పెరుగుతోంది. టూరిస్ట్ గైడ్ల వంటి పాత్రల కోసం మనం కూడా మహిళలను ముందుకు తీసుకురావాలని మోడీ కోరారు. తద్వారా బనారస్‌కు బయటి నుండి వచ్చే పర్యాటకులు అన్ని విషయాల గురించి సమాచారాన్ని కలిగి ఉంటారు మరియు మహిళా పర్యాటకులకు కూడా సులభంగా ఉంటుంది.