ఏపీలోని 60 ఏళ్ల పైబడిన వారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బస్సు ప్రయాణంలో వారికి 25 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించింది. రాయితీని పొందాలనుకునే వృద్ధులు, 60 ఏళ్లు దాటినట్లుగా ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డులను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఫోన్ లో ఆధార్ కార్డు చూపించినా రుజువుగా భావిస్తామన్నారు. గుర్తింపు ఉన్న ఏ ఒక్క కార్డును తమ వెంట తీసుకొచ్చినా వారికి ఇవ్వాల్సిన టికెట్లలో 25 శాతం రాయితీని కల్పించనున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయంపై అన్ని జిల్లాల డీఎంలు, సూపర్ వైజర్లు, కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.