ASF: జిల్లా కేంద్రం కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో మళ్లీ పునరుద్ధరించనున్నట్లు ఆయన పేర్కొ న్నారు. అర్జీదారులు గమనించాలని కోరారు.