విశాఖ: పీఎంపాలెం పరిధిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. భారతికి తన భర్త చనిపోయిన తర్వాత ఆటో డ్రైవర్ శ్రీనుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి ఆమె అత్త అడ్డుచెప్పి ఇంటి నుంచి వెళ్లిపోమనడంతో మనస్థాపం చెంది ఉరివేసుకుంది. తను చనిపోయానని అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్పు అని తన కుమారుడిని ఉద్ధేశించి సూసైడ్ నోట్లో రాసింది.