KMM: న్యాయవాదులు నిత్య విద్యార్థులుగా ఉంటూ, అధ్యయనం చేయాలని హైకోర్టు మాజీ జడ్జి శివ శంకరరావు అన్నారు. ఖమ్మంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన న్యాయవాదుల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఉన్నత న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. జిల్లా న్యాయమూర్తి వెంపటి అపర్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.