KRNL: ఆస్పరి, దేవనకొండ మండలాల్లో పత్తి సీజన్ ప్రారంభమైంది. పత్తి తీయడానికి రోజూ వందలాది మంది ట్రాక్టర్లు, ఆటోలలో కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, ఓవర్ లోడింగ్ కారణంగా ఈ ప్రయాణం యమపాశంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రమాదం సంభవిస్తుందోనన్న భయం కూలీలను వెంటాడుతోందని వారు తెలిపారు.