GDWL: ప్రజావాణి కార్యక్రమాన్ని రేపటి నుంచి యథావిధిగా ప్రతి సోమవారం నిర్వహిస్తామని కలెక్టర్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజావాణిని నిలిపివేశామని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ రద్దు కావడంతో యథావిధిగా ప్రజావాణి కొనసాగిస్తామన్నారు. జిల్లా ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.