ADB: ఓటు చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సంతకాల సేకరణ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ ఓటు చోరీని ప్రజలకు స్పష్టంగా వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.