SKLM: ఎచ్చర్ల మండల కేంద్రం నుంచి కుప్పిలి, కొయ్యాం, బుడగట్లపాలెం, బడివానిపేట, తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా మలుపులు ఉన్నాయని వాహనదారులు తెలిపారు. మలుపులు వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు వాపోతున్నారు. వర్షాలు పడితే మరింత ప్రమాదకరంగా ఈ మార్గం తయారైందన్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.