NLR: ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ అతిథి అధ్యాపకుడి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ నారాయణస్వామి తెలిపారు. ఎంఎస్సీ ఫిజిక్స్‌లో 55% మార్కులు సాధించిన వారు అర్హులని అన్నారు. నెట్, సెట్అనుభవమున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మంగళవారం వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.