ADB: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలనపై పోలీసులు దృష్టి సారించారు. ఆదిలాబాద్, ఉట్నూర్ ఎసీపీవోల పరిధిలో రౌడీలు, అనుమానిత నేరస్థులపై వారానికోసారి తనిఖీలు, బైండోవర్ కేసులు పెట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. ‘గంజాయి రహిత ఆదిలాబాద్’ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు 141 కేసులు నమోదు చేసి, 290 మందిని అరెస్ట్ చేశారు.