GNTR: అనపర్రు హాస్టల్ వార్డెన్ ఎన్. మార్కండేయులపై సస్పెన్షన్ వేటు పడింది. కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి వసతి గృహంలో ఆహారం తీసుకుని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ఆదివారం కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.