KNR: చొప్పదండి మండలం కొలిమికుంట నుంచి సైనిక్ స్కూల్కు వెళ్లే రహదారి బురద, గుంతలతో అధ్వానంగా తయారయ్యింది. వీధి దీపాలు కూడా లేకపోవడంతో రాత్రులు ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సైనిక్ స్కూల్ బాగోగులు పట్టించుకోవాలని కోరారు.