విశాఖ: సోమవారం వేకువజాము నుంచి జిల్లాలో వర్షం కురుస్తోంది. మాధవధార, మురళీనగర్, కంచరపాలెం, ఎన్ఏడీ ప్రాంతాల్లో ఆగకుండా వర్షం కురవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున వర్షం పడటంతో వాహనదారులు, పాదచారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల కాలువలు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి.