SKLM: పౌరసరఫరాల శాఖమంత్రి నాదేండ్ల మనోహర్ నేడు జిల్లాకు రానున్నట్లు పౌర సరఫరాలశాఖ జిల్లా మేనేజర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో పౌరసరఫరాల అధికారులతో జరిగే సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళంతో పాటు 4 జిల్లాల కలెక్టర్లు పాల్గొంటారన్నారు.