SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆదివారం ధర్నా రాస్తారోకో చేపట్టారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పేరిట భీమేశ్వరాలయంలో దర్శనాలు కల్పించడం పట్ల బీజేపీ నాయకులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సిరిసిల్ల కామరెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. రోడ్డు కిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.