SRD: ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ జెడ్పీటీసీ లక్ష్మి రవీందర్ నాయక్ అధికారులను కోరారు. మండలంలోని పలుగుతాండ గ్రామపంచాయతీలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని లక్షల రూపాయల అప్పులు చేశారని తెలిపారు. బిల్లుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి బిల్లులు చెల్లించాలని కోరారు.