SKLM: టెక్కలి మేజరు పంచాయతీ అభివృద్ధిపై ఆదివారం పంచాయతీ అధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచనలు చేశారు. టెక్కలిలో స్పెషల్ శానిటేషన్ పనులు పటిష్ఠంగా చేయాలన్నారు. ప్రతీ వీధికి రక్షిత మంచినీటి సరఫరా, వీధి లైట్లు, రోడ్లపై కుక్కలు, ఆవుల సంచారాన్ని నియంత్రించాలన్నారు. పంచాయతీ ఆదాయానికి ఇంటి పనులు వసూళ్లు, సెస్‌లు సక్రమంగా వసూళ్లు చేయాలన్నారు.