ఢిల్లీ వేదికగా విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. స్టంప్స్ సమయానికి WI రెండో ఇన్నింగ్సులో 2 వికెట్లు కోల్పోయి 173 రన్స్ చేసింది. జాన్ చాపెల్(87*), షాయ్ హోప్(66*) అర్థశతకాలు చేశారు. WI తమ తొలి ఇన్నింగ్సులో 248 రన్స్‌కే అలౌట్ కాగా.. భారత్ ఫాలోఆన్‌కి ఆహ్వానించింది. విండీస్ ఇంకా 97 రన్స్ వెనకపడి ఉంది.