కోనసీమ: అమలాపురం కలెక్టరేట్ లో సోమవారం ఉదయం 10 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారులు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను వ్రాత పూర్వకంగా అందజేయాలన్నారు.