NRML: బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం నుండి అయ్యప్ప సన్నిధికి వెళ్లే భక్తుల పాదయాత్రను ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ ప్రారంభించారు. సునీల్ దత్ గురుస్వామి ఆధ్వర్యంలో 40 మంది అయ్యప్ప మాలదారులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావాలని సరస్వతి అమ్మవారిని మొక్కుకున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.