CTR: చౌడేపల్లిలో పెద్ద ఎల్లకుంట్ల పంచాయతీ ఊటూరు గ్రామంలో తాగునీరు వృథా అవుతుండటంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోయకొండ ప్రధాన రహదారికి సమీపంలో పగిలిన కొళాయి నుంచి నిరంతరం నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇకనైనా అధికారులు స్పందించి కొళాయిలను మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.